పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద జరిగిన పరిస్థితులను బహిర్గతం చేయడానికి సీసీటీవీ ఫుటేజీతో పాటు మొత్తం వెబ్‌కాస్టింగ్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన జగన్… “పులివెందులలో ఇది నిజంగా ఎన్నికేనా? ఇతర గ్రామాల ప్రజలు వచ్చి ఇక్కడ ఓటు వేయడం ఎందుకు? ప్రజలను భయపెట్టేందుకే భారీగా పోలీసులను మోహరించారు. కేవలం ఆరు పంచాయతీలకే 700 మంది పోలీసులను నియమించారు. ఒక్కో బూత్‌లో 500 మందివరకు బయటి వ్యక్తులు ఓటు వేశారు. పులివెందుల ఓటరు కాని బీటెక్ రవి అక్కడే ఉండి ప్రభావం చూపారు. బందిపోటు దొంగల తరహాలో ఈ ఎన్నిక సాగింది” అని విమర్శించారు.
Read More : గుంటూరులో భారీ వర్షాలు: కాజా టోల్ గేట్ వద్ద స్తంభించిన ట్రాఫిక్

One thought on “పులివెందుల ఉపఎన్నికలపై జగన్ ఆరోపణలు”
Comments are closed.