హెడ్స్ ఆఫ్ స్టేట్ ట్రైలర్ రిలీజ్ : ఎంఐ6 ఏజెంట్‌గా ప్రియాంక బ్లాక్ బస్టర్ లుక్

Priyanka Chopra Heads of State trailer

గ్లోబల్ ఐకన్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘బేవాచ్’, ‘క్వాంటికో’, ‘సిటాడెల్’ వంటి ప్రాజెక్ట్స్‌తో అంతర్జాతీయ గుర్తింపును సాధించిన ఆమె, త్వరలోనే రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ మూవీ ద్వారా టాలీవుడ్‌కు అడుగుపెడుతోంది.

ప్రియాంక నటించిన హాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బా లాంటి హాలీవుడ్ స్టార్‌లతో కలిసి ప్రియాంక అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించింది. ట్రైలర్ మొత్తం యాక్షన్, హమ్మింగ్ కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది.

కథ ప్రకారం జాన్ సెనా అమెరికా అధ్యక్షుడిగా, ఇద్రిస్ ఎల్బా బ్రిటన్ ప్రధాని పాత్రలో నటించగా.. వీరిద్దరూ ఓ ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. అప్పుడు వీరిని కాపాడేందుకు ఎంట్రీ ఇస్తుంది ప్రియాంక చోప్రా. ఆమె పోషించిన ఎంఐ6 ఏజెంట్ నోయెల్ బిస్సిట్ పాత్ర ట్రైలర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

హెడ్స్ ఆఫ్ స్టేట్ చిత్రం జూలైలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధమవుతోంది. యాక్షన్‌తో పాటు వినోదాన్ని సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం, ప్రియాంకకు గ్లోబల్ స్టార్డమ్‌కి మరింత స్థిరతను ఇవ్వనుంది.

Read More


One thought on “హెడ్స్ ఆఫ్ స్టేట్ ట్రైలర్ రిలీజ్ : ఎంఐ6 ఏజెంట్‌గా ప్రియాంక బ్లాక్ బస్టర్ లుక్

Comments are closed.