ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్స్ పారితోషికం చాలా తక్కువగా ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పారితోషికం మరింత తక్కువ స్థాయిలోనే ఉండేది. స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా కోటి రూపాయల పారితోషికం దక్కకపోవడం సర్వసాధారణమైంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. హీరోల పారితోషికాలు భారీగా పెరగడంతో పాటు, హీరోయిన్స్‌కి కూడా గణనీయమైన రెమ్యునరేషన్ ఆఫర్లు వస్తున్నాయి.
బాలీవుడ్లో ఆలియా భట్, దీపికా పదుకునే లాంటి స్టార్ హీరోయిన్స్ తర్వాత, ఇప్పుడు ప్రియాంక చోప్రా అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్గా నిలిచింది. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ఆమె రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత భారీ పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ సృష్టించనుంది.
ప్రియాంక చోప్రా కేవలం మహేష్ – రాజమౌళి చిత్రమే కాదు, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘క్రిష్ 4’ సినిమాలో కూడా నటించనుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో, గ్లోబల్ గుర్తింపు ఉన్న ప్రియాంకను ఎంచుకున్నారని సమాచారం. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె బ్రాండ్ వ్యాల్యూ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోనూ భారీగా ఉపయోగపడనుంది.
ప్రియాంక చోప్రా గత ఐదేళ్లుగా హాలీవుడ్లో ఉన్నా, అక్కడ పెద్ద విజయాలు అందుకోలేకపోయింది. అయినప్పటికీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ పెరిగింది. రాజమౌళి వంటి ప్రముఖ దర్శకుడు ఆమెకు రూ.30 కోట్లు రెమ్యునరేషన్ మంజూరు చేయడం, ఆమె స్టాటస్‌ను మరింత పెంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రియాంక చోప్రా పారితోషికం, హీరోయిన్స్ స్థాయిని కొత్త స్థాయికి తీసుకెళ్లింది.

One thought on “మహేష్-రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రాకు భారీ పారితోషికం!”
Comments are closed.