కస్టమర్లు నిర్ణీత గడువులోగా కేవైసీ అప్‌డేట్ చేయకుంటే, వారి ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా మూసివేయడం జరుగుతుందని బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. బ్యాంకింగ్ (Banking) సేవలను నిరాఘాటంగా కొనసాగించేందుకు ఖాతాదారులు త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

PNB ONE యాప్ ద్వారా KYC అప్‌డేట్ చేసుకోవడం ఎలా?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు తమ కేవైసీ అప్‌డేట్ చేయాలంటే, ముందుగా PNB ONE యాప్ (PNB ONE App) ను గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేదా యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store) నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- యాప్ (App) లో లాగిన్ (Login) చేసి, KYC అప్‌డేట్ (KYC Update) ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
- అప్పటికి KYC స్టేటస్‌ను చెక్ చేయవచ్చు. స్టేటస్ Pending (పెండింగ్) గా ఉంటే, Update KYC ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ఆధార్ ఆధారిత ఓటీపీ (OTP – One Time Password) వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- కస్టమర్ ఆధార్ నంబర్ (Aadhaar Number) కు లింక్ అయిన మొబైల్ నంబర్ (Mobile Number) కు ఓటీపీ వస్తుంది.
- అటు తర్వాత, పొందిన OTP ని ఇచ్చిన ఫీల్డ్‌లో ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
ఓటీపీ వెరిఫికేషన్ (OTP Verification) విజయవంతమైతే, KYC అప్‌డేట్ పూర్తవుతుంది. ఖాతాదారుల అకౌంట్ (Account) కూడా యాక్టివ్ అవుతుంది.
కస్టమర్లు తమ బ్యాంకింగ్ సేవలు అంతరాయం లేకుండా కొనసాగించాలంటే, త్వరగా KYC అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని PNB స్పష్టం చేసింది.
Read More : రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) త్వరలో భారత్ (India) పర్యటన.. మోదీ (Modi) ఆహ్వానం పంపినట్లు అధికారిక ప్రకటన!

One thought on “పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకుAlert: ఏప్రిల్ 10లోపు KYC అప్‌డేట్ చేయాలి!”
Comments are closed.