పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ దక్కింది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ (OG) నుంచి మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. విడుదలైన వెంటనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
పోస్టర్‌లో పవన్ కల్యాణ్ ఓ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ముంబైలోని తాజ్ హోటల్ ముందు, వింటేజ్ ‘డాడ్జ్’ కారుపై కూర్చుని ఉన్న ఆయన లుక్ సినీప్రేమికులను ఆకట్టుకుంటోంది. దీంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.
దర్శకుడు సుజీత్ కూడా సోషల్ మీడియా ద్వారా పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. “పవన్ కల్యాణ్ అనేక మందికి స్ఫూర్తి. ఆయన కోట్లాది అభిమానుల్లో నేనూ ఒకడిని. మీరే నా తొలి హీరో, ఇప్పుడు నా ‘ఓజీ’” అంటూ సుజీత్ పేర్కొన్నారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా, సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Read More : యాంకర్ అషు రెడ్డి: పవన్ కల్యాణ్ పేరు టాటూ..

One thought on “పవన్ కల్యాణ్ బర్త్‌డే ట్రీట్: ‘ఓజీ’ కొత్త పోస్టర్ రిలీజ్.”
Comments are closed.