పంజాగుట్టలో ఉల్లిపాయల లోడుతో లారీ బోల్తా..

హైదరాబాద్‌ పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్రేన్‌ సహాయంతో లారీని తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.
ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Read More : హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టారా?..