ఆస్కార్‌లో కొత్త చాప్టర్: స్టంట్ కొరియోగ్రఫీకి గౌరవం!

Oscars Action Choreography Award

ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఓ కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఇప్పటివరకు ఎన్నో విభాగాల్లో ప్రతిభను గుర్తించినప్పటికీ, స్టంట్ కొరియోగ్రఫీ విభాగాన్ని ఎప్పుడూ దాటి చూసేసింది. కానీ ఇప్పుడు ఆ పరంపరకి బ్రేక్ పడి పోతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘RRR’ మూవీ ద్వారా ఈ విభాగానికి మరింత ప్రాధాన్యం లభించడంతో, ఈ విభాగాన్ని అధికారికంగా గుర్తించాలనే డిమాండ్ పెరిగింది.

ఇదే దృష్టిలో ఉంచుకుని తాజాగా ఆస్కార్ అకాడమీ కీలక నిర్ణయం తీసుకుంది. 2027 సంవత్సరానికి గాను నిర్వహించబోయే 100వ అకాడమీ అవార్డుల వేడుకలో స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో అవార్డును అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను అకాడమీ తమ అధికారిక ఎక్స్ (Twitter) ఖాతా ద్వారా వెల్లడించింది. ఆసక్తికరంగా RRR సినిమాలోని యాక్షన్ సీన్ స్టిల్‌ ను షేర్ చేస్తూ ఈ ప్రకటన చేయడం విశేషం.

ఈ ప్రకటనకు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “ఇదే నిర్ణయం కొన్నేళ్ల క్రితం తీసుకుని ఉంటే ‘RRR’ మరో ఆస్కార్ అవార్డును దక్కించుకునేది” అంటూ ఫిల్మ్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. భారతీయ యాక్షన్ చిత్రాల ప్రాముఖ్యతకు ఇది ఒక గొప్ప గుర్తింపు అని చెబుతున్నారు.

యాక్షన్ కొరియోగ్రఫీకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చే ఈ అభివృద్ధిని ఇండస్ట్రీలోని స్టంట్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ఇకపై ప్రతి యాక్షన్ సన్నివేశం వెనుక ఉన్న శ్రమకు గౌరవం లభించనుంది. ఇది ప్రపంచ సినిమాల్లో యాక్షన్ విభాగానికి మరింత గౌరవం తీసుకురానుంది.

Read More


One thought on “ఆస్కార్‌లో కొత్త చాప్టర్: స్టంట్ కొరియోగ్రఫీకి గౌరవం!

Comments are closed.