ఫిర్యాదు చేసిన వ్యక్తినే చితకబాదిన పోలీసులు..

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల దురుసు ప్రవర్తన కలకలం రేపుతోంది. ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సాయిలు అనే వ్యక్తి తన పాన్ షాప్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవిస్తున్నారని 100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.

అయితే ఫిర్యాదుకు పోలీసులు స్పందించకపోగా, కేసు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించగా ఆయనపైే గూండాలా దాడి చేసినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. పోలీసులే తనను దారుణంగా కొట్టారని, తమకు రక్షణ కల్పించాల్సిన వారు ఇలాంటి క్రూరత్వం ప్రదర్శిస్తే సామాన్య ప్రజలు ఎలా బ్రతకాలన్నారు సాయిలు.

బాధితుడు సహా గ్రామస్తులు ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ – కారణం లేకుండా కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More : హనుమకొండలో ఆర్టీసీ బస్సు బోల్తా – 15 మందికి గాయాలు.

One thought on “ఫిర్యాదు చేసిన వ్యక్తినే చితకబాదిన పోలీసులు..

Comments are closed.