నైజీరియాలో పడవ బోల్తా: 60 మందికి పైగా మృతి

ఆఫ్రికా దేశం నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. బోర్గూ ప్రాంతంలో ఒక పడవ బోల్తా పడటంతో 60 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదానికి కారణం
పడవ ప్రమాదానికి ప్రధాన కారణం పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం అని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పడవలో సామర్థ్యానికి మించి ప్రజలు ఉండటం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే ఈ విషాదం జరిగిందని వారు చెప్పారు.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read More : ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ..

One thought on “నైజీరియాలో పడవ బోల్తా: 60 మందికి పైగా మృతి

Comments are closed.