ప్రఖ్యాత నటులు అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య బుధవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై దాఖలైన పరువు నష్టం కేసు విచారణలో భాగంగా తండ్రీకొడుకులు న్యాయమూర్తి ఎదుట తమ వాంగ్మూలాలను నమోదు చేశారు.
మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ నాగార్జున ఈ దావా వేశారు. విచారణ సందర్భంగా నాగచైతన్య కూడా తన వాదనను సమర్పించారు. మనోరంజన్ కోర్టులో జరిగిన ఈ విచారణకు నాగార్జున, నాగచైతన్య ఒకేసారి హాజరవడంతో కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొంది. వారి వాంగ్మూలాల నమోదు ఈ కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు. కోర్టు తదుపరి విచారణ తేదీని ప్రకటించనుంది.
Read More : సమంత–రాజ్ నిడిమోరు గాసిప్స్ మళ్లీ హాట్ టాపిక్ .
One thought on “నాంపల్లి కోర్టులో హాజరైన నాగార్జున–నాగచైతన్య.”
Comments are closed.