‘నాగ్ జిల్లా’ పోస్టర్ వివాదం.. కరణ్‌పై కాపీ క్యాట్ విమర్శలు

Nag Jilla poster controversy

ఇండస్ట్రీలో వినూత్న కథలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో, బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ మరోసారి విమర్శల పాలు అయింది. ‘నాగ్ జిల్లా’ పేరుతో ఇచ్చాధారి నాగుని నేపథ్యంలో రూపొందుతున్న కొత్త సినిమా పోస్టర్ వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోను నకలు చేసినట్టుగా సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ గమనించిన విషయం ఏమంటే, పోస్టర్‌లో కనిపించిన కార్తీక్ లుక్, ఆయన గతంలో ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోతో చాలా దగ్గరగా ఉంది. దీంతో కరణ్ జోహార్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘ధర్మ ప్రొడక్షన్స్‌కి క్రియేటివిటీ మిగలలేదా?’ అంటూ మీమ్స్ చేస్తున్నారు. గతంలో ఏక్తా కపూర్ “నాగిన్” సిరీస్‌కు సంబంధించి వచ్చిన కామెంట్లతో పోల్చుకుంటూ ఈ మూవీ కాపీ కాట్స్ ప్రయత్నమేనని సెటైర్లు వేస్తున్నారు.

పోస్టర్ విషయానికి వస్తే, కార్తీక్ ఆర్యన్ శరీరాన్ని నాగుపాము చుట్టుకున్నట్లు చూపిస్తూ, ఆయన రూపురేఖల్లో మార్పు చూపించే విధంగా డిజైన్ చేశారు. నాగుపాము డెన్ మధ్యన నిలబడి ఉన్న ఆయన బ్యాక్ లుక్ పోస్టర్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఇది పక్కా కమర్షియల్ అటెంప్ట్‌గా కనిపించినప్పటికీ, ఒరిజినాలిటీ తక్కువగా ఉందన్నది పబ్లిక్ అభిప్రాయం.

ఇటీవల బాలీవుడ్‌లో అసలు కథల కన్నా రీమేక్స్, నకిలీ పోస్టర్ల దిశగా ప్రయాణం ఎక్కువైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ వంటి ప్రముఖ నిర్మాత ఇటువంటి విషయాల్లో పేరు పెట్టుకోవడాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వివాదం మధ్య ‘నాగ్ జిల్లా’ సినిమాపై ఆసక్తి పెరిగినప్పటికీ, అసలు కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

Read More


One thought on “‘నాగ్ జిల్లా’ పోస్టర్ వివాదం.. కరణ్‌పై కాపీ క్యాట్ విమర్శలు

Comments are closed.