‘సీతారామం’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్‌కు తొలి చిత్రంతోనే అపారమైన గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత నాని సరసన నటించిన ‘హాయ్ నాన్న’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించేందుకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. బాలీవుడ్‌లో దశాబ్దం పాటు సినిమాలు చేసినా రాని స్టార్‌డమ్, మృణాల్‌కు టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే దక్కింది. అయితే, సౌత్‌లో కంటే బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయాలనే ఆసక్తి ఈ నటి చూపిస్తోంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు, వీడియోలు, సినిమాలతో హాట్ టాపిక్‌గా ఉండే మృణాల్ తాజాగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో అందం గురించి మాట్లాడిన వ్యాఖ్యలు అనేక రకాలుగా అర్థం చేసుకోవడంతో విమర్శలు ఎదురయ్యాయి. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థించగా, మరికొందరు “సోమరి” అని విమర్శించారు.
తాజాగా ఈ వివాదంపై మృణాల్ స్పందిస్తూ, “నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పిన ఉద్దేశాన్ని వక్రీకరించి చూపించారు. వంకరగా ఉండటానికి, సోమరిగా ఉండటానికి తేడా ఉందని చెప్పినా, చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది” అని క్లారిటీ ఇచ్చింది.
సినిమాల విషయానికొస్తే, ఈ ఏడాది బాలీవుడ్ మూవీ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’లో నటించినా, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘డెకాయిట్’ చిత్రంలో విభిన్న లుక్‌తో కనిపించబోతోంది. అలాగే, అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు మరికొన్ని హిందీ సినిమాలు కూడా మృణాల్ చేతిలో ఉన్నాయి.

One thought on “Mrinal Thakur – వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందన”
Comments are closed.