ఏపీ లిక్కర్ స్కాం పై మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్..

ఏపీ లిక్కర్ స్కాం పై వివాదాలు కొనసాగుతుండగా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు నమోదు కాకపోయినా, ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశముందన్న అంచనాలతో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను నేడు జస్టిస్ జేవీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కేసు నెం.62గా లిస్టు చేసింది.

లిక్కర్ కుంభకోణంపై ఇప్పటికే ఏపీ సీఐడీ కేసు నమోదు చేయగా, పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డిపై కూడ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ముందుగా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే, ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా బెయిల్ ఎలా మంజూరు చేయమని హైకోర్టు అభిప్రాయపడుతూ ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఈ పరిణామాల తర్వాత మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వద్ద తలపెట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌పై ఏమేరకు సానుకూలంగా స్పందిస్తుందన్నది రాజకీయంగా, న్యాయపరంగా ఆసక్తికరంగా మారింది.

Read More : వైద్య సేవలు నిలిచిన ఏపీకి కాంగ్రెస్ హెచ్చరిక..

One thought on “ఏపీ లిక్కర్ స్కాం పై మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్..

Comments are closed.