రామ్ చరణ్ కూతురు క్లీంకార పుట్టినరోజు వేడుకల్లో వైట్ టైగర్ సర్ప్రైజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, ఉపాసన దంపతుల గారాలపట్టి, మెగా వారసురాలు క్లీంకార పుట్టిన రోజు సందర్భంగా తాజాగా షేర్ చేసిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిన్నారి క్లీంకార రెండో పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని జూ పార్కులో తెల్ల పులితో కలిసి దిగిన చిత్రాన్ని ఉపాసన శనివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

క్లీంకార ఫేస్‌ ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారోనని ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉపాసన షేర్ చేసిన ఫోటోలన్నిటిలోనూ చిన్నారి ముఖాన్ని ఎమోజీలతో కవర్ చేస్తూనే వచ్చారు. ఈసారి కూడా అదే తరహాలో ఫొటోను షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ… “హైదరాబాద్ జూ లోని తెల్ల పులి పిల్లను దత్తత తీసుకున్నాం. దానికి మా క్లీంకార పేరు పెట్టాం. వన్యప్రాణుల సంరక్షణకు మేము మద్దతు ఇస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

క్లీంకారతో ఎప్పుడు బయటకి వచ్చినా మీడియా ఫోకస్ అంతా వారిపైనే ఉంటుంది. చిన్నారి ముఖాన్ని చూపించాలన్న మీడియా తహతహల మధ్య కూడా ఇప్పటివరకు క్లీంకార ఫేస్‌ ఎక్కడా బయటకు రాలేదు. కానీ ప్రతి సారి ఫొటోలు, అప్డేట్స్‌తో మెగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఉపాసన తాజాగా మరోసారి ప్రేమను చాటారు.

read More : శేఖర్ కమ్ముల ‘కుబేర’కు అద్భుత స్పందన

One thought on “రామ్ చరణ్ కూతురు క్లీంకార పుట్టినరోజు వేడుకల్లో వైట్ టైగర్ సర్ప్రైజ్

Comments are closed.