కిడ్నీ సమస్యల సంకేతాలు రాత్రి వేళల్లోనే కనిపిస్తాయా?

కిడ్నీ సమస్యలు మొదలైనప్పుడు శరీరంలో అనేక లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో కనిపించే కొన్ని మార్పులు కిడ్నీ వ్యాధికి సంకేతాలుగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ పనితీరు తగ్గిపోతే రాత్రిళ్లు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం ఒక ప్రధాన లక్షణం. పలుమార్లు వాష్‌రూమ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి కిడ్నీ డ్యామేజ్‌కి సంకేతమని వైద్యులు సూచిస్తున్నారు. ఇక కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో సోడియం సమతౌల్యం దెబ్బతింటుంది. దీని ప్రభావంగా మడమలు, పాదాలు, చేతుల్లో వాపు వస్తుంది. రాత్రి వేళ ఈ వాపులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

కిడ్నీలు విషతుల్యాలను తొలగించడంలో సమస్యలు ఎదుర్కొంటే చర్మంపై కూడా ప్రభావం చూపిస్తుంది. రాత్రి వేళ దురదలు, పాదాల్లో మంటలు కలుగుతాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నిద్ర కూడా దెబ్బతింటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు నిద్రలేమి, అలసట, నిస్సత్తువతో ఇబ్బంది పడతారు. కొంతమందికి ఊపిరి తీసుకోవడంలో కష్టాలు ఏర్పడి, పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.

నిపుణుల సూచన ప్రకారం, వయసుపైబడిన వారు ముఖ్యంగా ఈ మార్పులను గమనిస్తూ, చిన్న సమస్యైనా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే వ్యాధిని తొలి దశలోనే గుర్తించి సమయానికి చికిత్స పొందవచ్చు.

Read More : కాలేయం, నిద్ర, అనీమియా, బీపీ-షుగర్ నియంత్రణ చిట్కాలు