శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఖుషి కపూర్, 2023లో “ది ఆర్చీస్” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే గుర్తింపు వచ్చినప్పటికీ నటన పరంగా పెద్దగా మెప్పించలేకపోయింది. అయినప్పటికీ స్టార్ కిడ్ హైప్‌తో మరో అవకాశాన్ని అందుకుంది. తెలుగులో అక్క జాన్వీ కపూర్ మాదిరిగా అవకాశాల కోసం ట్రై చేస్తోంది కానీ పెద్దగా స్పందన రావడం లేదని టాక్.
ఇటీవల విడుదలైన “లవ్ యాపా”లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఖుషి, వెండితెరపై కాదు కానీ సోషల్ మీడియాలో మాత్రం భారీగా ఆకర్షిస్తోంది. తన గ్లామర్ ఫోటోలు, స్టైలిష్ లుక్స్‌తో తరచూ ట్రెండింగ్‌లో ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా బ్లాక్ టాప్, బ్లూ పాయింట్ లో దర్శనం ఇచ్చి నెటిజన్లను మెస్మరైజ్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ ఫాలోవర్స్‌ను దక్కించుకున్న ఖుషి, రెగ్యులర్‌గా ఫోటోషూట్లు చేస్తూ తనదైన మార్క్ సృష్టిస్తోంది. ఈ గ్లామర్ ఎఫెక్ట్‌తో బాలీవుడ్‌కు మాత్రమే కాకుండా దక్షిణాది పరిశ్రమలకు కూడా చేరువవ్వాలని ఆశిస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగు పరిశ్రమ నుంచి ఆఫర్లు పెద్దగా రాకపోవడంతో ఇంకొన్ని ప్రయత్నాలు చేస్తోంది.

నటిగా కాకుండా టెక్నీషియన్‌గానూ ఖుషికి మంచి ఫ్యాషన్ ఉంది. 2019లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పని చేసిన అనుభవం ఉంది. ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా త్వరలో ఖుషి కోసం ఓ రీమేక్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఖుషి తన సొంత శైలిలో పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

One thought on “ఫోటో ఫైర్: ఖుషి కపూర్ స్టన్నింగ్ లుక్”
Comments are closed.