కర్ణాటకలో విషాదం: ఉపాధ్యాయుడు విసిరిన కర్రతో 6 ఏళ్ల బాలుడు దృష్టి కోల్పోయిన ఘటన

కర్ణాటక రాష్ట్రంలో 2024లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఉపాధ్యాయుడు తరగతిలో శాంతి నెలకొలపాలనే ఉద్దేశంతో విసిరిన కర్ర ఒక ఆరేళ్ల చిన్నారి కన్నులో బలంగా తగలడంతో, అతను శాశ్వతంగా దృష్టి కోల్పోయాడు.

ఈ ఘటన సమయంలో చిన్నారి తరగతిలో ఉన్నాడు. అల్లరి చేస్తున్న విద్యార్థులను నియంత్రించేందుకు ఉపాధ్యాయుడు కర్రను విసిరాడు. అయితే అది పొరపాటుగా బాలుడి కంటిపై బలంగా తాకింది. వెంటనే తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి రెండు సర్జరీలు నిర్వహించినా, దృష్టి తిరిగి రాలేదు.

చిన్నారి కుటుంబం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధ్యత వహించాల్సిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో పిల్లల భద్రతపై అనేక ప్రశ్నలు తీసుకొచ్చింది. పాఠశాలలు విద్య అందించడమే కాదు, విద్యార్థుల ప్రాణాలను, భద్రతను కూడా సమర్థంగా కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read More : భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు