బంగారం అక్రమ రవాణా కేసులో జైలులో ఉన్న కన్నడ నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) భారీ షాక్ ఇచ్చింది. రన్యారావుకు ఏకంగా రూ.102.55 కోట్ల జరిమానా విధిస్తూ అధికారులు జైల్లోనే షోకాజ్ నోటీసులు అందజేశారు.
ఈ కేసులో రన్యారావుతో పాటు మరో ముగ్గురు నిందితులున్నారు. నలుగురిపైనా కలిపి మొత్తం రూ.270 కోట్ల పెనాల్టీ విధించినట్లు డీఆర్ఐ స్పష్టం చేసింది. నిర్దేశిత గడువులోగా జరిమానా చెల్లించని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు. దీంతో ఈ కేసు మరోసారి కన్నడ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత మార్చి నెలలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 14.3 కిలోల బంగారంతో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి, విచారణ జరిపిన కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది.
ఇక విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
Read More : యమునా : ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన నీటిమట్టం
2 thoughts on “కన్నడ నటి రన్యారావుకు డీఆర్ఐ భారీ జరిమానా ?”
Comments are closed.