ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పాము కనిపించడం భక్తులను భయాందోళనలకు గురిచేసింది. ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న క్యూ లైన్‌లో ఒక్కసారిగా పాము రావడం చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు.
పాము పట్టుకున్న అధికారులు
ఈ ఘటన ఆలయ ప్రాంగణంలో కాసేపు కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న నిపుణుల బృందం పామును పట్టుకుని ఒక సంచిలో బంధించి, సురక్షిత ప్రాంతానికి తరలించింది. పాము కనిపించిన సమయంలో పోలీసులు, ఆలయ సిబ్బంది భక్తులను అదుపులోకి తీసుకుని, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తపడ్డారు.
ఈ ఘటనతో ఆలయానికి వచ్చే భక్తులు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో క్యూ లైన్‌లో ఉన్నవారు కాసేపు తీవ్ర భయానికి గురయ్యారు.
Read More : ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్న మంత్రి నారా లోకేశ్.