ముంబైలో ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ ప్రార్థన సభలో బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో జయా బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియోలో జయా బచ్చన్ ఓ మహిళతో మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి ఆమెను ఓ వ్యక్తి టచ్ చేయడం, వెంటనే జయా బచ్చన్ అసహనం వ్యక్తం చేయడం కనిపిస్తోంది. ఆమె వెంటనే ఆ చేతిని తిప్పి పంపేశారు.
ఆ మహిళ చేతిచాచినప్పటికీ జయా బచ్చన్ ఫోటోకు అంగీకరించలేదు. ఆమె మొహంపై అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. అంతే కాదు, అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయాలని ట్రై చేయగా, ఆమె అందుకు కూడా ఒప్పుకోలేదు. ఈ సంఘటన అనంతరం ఆ మహిళ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది.
జయా బచ్చన్ ప్రవర్తనపై కొందరు విమర్శలు చేస్తుంటే, మరికొందరు ఆమె వైఖరికి మద్దతు కూడా వ్యక్తం చేస్తున్నారు. “ఇది ఒక ప్రార్థనా సభ. ఇలాంటి సందర్భాల్లో సెల్ఫీలు, ఫోటోలు అడగడం దారుణం. జయా బచ్చన్ చేసినది తప్పేమీ కాదు” అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె అహంకారంగా ప్రవర్తించిందని అభిప్రాయపడ్డారు. శవయాత్రలకూ సెల్ఫీ సంస్కృతి చొచ్చుకొస్తున్నదంటే, ఇది సమాజపు మనోవైకల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

One thought on ““ఇది సంతాప సభ!” సెల్ఫీ కోరిన మహిళపై జయా బచ్చన్ ఆగ్రహం”
Comments are closed.