కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్న మాజీ సీఎం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 12న నెల్లూరు పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు నెల్లూరు చేరుకోనున్న జగన్, పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి ఆయన కుటుంబాన్ని ప్రోత్సహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలతో కూడా జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ తొలి సారిగా నెల్లూరు జిల్లాలో పర్యటించనుండటం ప్రత్యేకతగా మారింది. జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.

Read More : తిరుమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

One thought on “కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్న మాజీ సీఎం

Comments are closed.