ఇడ్లీ నిజంగా హెల్దీనా? తాజా నివేదికలో సంచలన విషయాలు!

Steam Idli

ఇడ్లీని ఆరోగ్యకరమైన అల్పాహారంగా భావించి చాలామంది తింటుంటారు. అయితే, తాజా నివేదిక ప్రకారం హోటళ్లలో తయారయ్యే ఇడ్లీ ఆరోగ్యానికి హాని కలిగించేలా మారిందని కర్ణాటక ఆహార భద్రతా విభాగం వెల్లడించింది.

ఆరోగ్య శాఖ అధికారులు బెంగళూరులో 251 హోటళ్లు, రోడ్‌సైడ్ విక్రేతల వద్ద నుంచి 500 ఇడ్లీల నమూనాలను సేకరించగా, 51 నమూనాల్లో హానికరమైన రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా, కొన్ని హోటళ్లు ఇడ్లీని ప్లాస్టిక్ షీట్లపై స్టీమ్ చేసుకుంటుండటంతో క్యాన్సర్ కారకాలు బయటపడినట్లు నివేదిక పేర్కొంది.

సాంప్రదాయంగా, ఇడ్లీ పిండిని కాటన్ బట్టలపై ఉంచి ఆవిరితో ఉడికించాల్సి ఉంటుంది. కానీ, ప్లాస్టిక్ షీట్లు వేడికి గురికావడంతో రసాయనాలు విడుదలై ఆహారంలో కలిసిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఇంట్లో స్వచ్ఛంగా తయారుచేసుకున్న ఇడ్లీనే భద్రమైనదని వైద్యులు సూచిస్తున్నారు.

Read More

One thought on “ఇడ్లీ నిజంగా హెల్దీనా? తాజా నివేదికలో సంచలన విషయాలు!

Comments are closed.