సాగరతీరంలో ఐపీఎల్ సందడి ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో విశాఖపట్నం రెండు మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది. ఈనెల 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) – లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ విక్రయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. టికెట్లను ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో డిస్ట్రిక్ట్ (Zomato District) ద్వారా విక్రయించనున్నారు. విశేషంగా, ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను విశాఖలోనే ఆడనుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు విశాఖపట్నం వేదికగా జరగడం క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది.
క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశాఖ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో ఆ ప్రాంతంలోని హోటల్స్, రెస్టారెంట్లు, టూరిజం హబ్‌లు సందడిగా మారనున్నాయి. ఇక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

One thought on “”
Comments are closed.