కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణికులకే అనుమతి**
భారతీయ రైల్వేలు ప్రయాణ భద్రతను మరింత మెరుగుపర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా 60 ప్రధాన రైల్వే స్టేషన్లలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇకపై కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణికులకే ప్లాట్‌ఫారమ్‌లలో ప్రవేశం కల్పించనున్నారు.
ఈ చర్య ద్వారా ప్రయాణికుల భద్రతను పెంచడంతో పాటు రద్దీని తగ్గించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ ముందుకు వచ్చింది. గతంలో ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకున్నవారికి ప్రవేశం కల్పించగా, తాజాగా కొత్త నియమాలు అమలులోకి వస్తే అనవసరమైన గుమికూడీలను నివారించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో భారీగా ఉండే రద్దీ సమస్యను తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ చర్యలను తీసుకోవడం గమనార్హం.
రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కేంద్ర రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ విధానం మరిన్ని స్టేషన్లలో అమలు అయ్యే అవకాశముందని సమాచారం.

3 thoughts on “60 ప్రధాన రైల్వే స్టేషన్లలో కొత్త నియమాలు:”
Comments are closed.