Rahul Gandhi: ఇండియా కూటమి భవిష్యత్తు పై సర్వే… రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కావాలని కోరిన ప్రజలు
దేశవ్యాప్తంగా దాదాపు 11 ఏళ్లుగా ఎన్డీయే (NDA) ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వం పాలనను సవాల్ చేయడానికై తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు అనేక రాజకీయ పార్టీలు కలసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (INDIA) పేరుతో ఓ గట్టి కూటమిని ఏర్పరచుకున్నాయి. 2024 ఎన్నికల్లో NDAకి వ్యతిరేకంగా పోటీ చేసినా, అద్భుత విజయాన్ని మాత్రం సాధించలేకపోయాయి. అయితే గణనీయమైన సీట్లు సంపాదించగలిగాయి. అయినప్పటికీ, కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, NDAని నిలువరించాలంటే ఐక్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. (Mood of the Nation survey)
సర్వేలో ఏముందంటే?
ఇండియా కూటమిపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఇండియాటుడే-సీ ఓటర్ సంయుక్తంగా “Mood of the Nation” అనే సర్వే నిర్వహించాయి. ఈ సర్వే 2024 జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో జరిగింది. సుమారు 1,25,123 మంది ఓటర్లను ఈ సర్వేలో ప్రశ్నించారు.
- సర్వేలో 65% మంది ఇండియా కూటమిలోని పార్టీలు కలిసి కొనసాగాలని అభిప్రాయపడ్డారు.
- 26% మంది ఈ అలయెన్స్ అవసరం లేదని భావించారు.
- 24% మంది ఈ కూటమికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వం వహించాలి అని అభిప్రాయపడ్డారు.
- 14% మంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నాయకత్వం వహించాలనుకున్నారు.
- 9% మంది ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal), 6% మంది సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) లీడర్ కావాలని కోరారు.
ఎన్డీయే-ఇండియా కూటముల మధ్య తేడా?
సర్వేలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఓ అంచనా వేసారు.
- ఇప్పుడే లోక్సభ ఎన్నికలు జరిగితే NDAకు 343 సీట్లు (2024లో 292) వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
- INDIA కూటమికి 188 సీట్లు (2024లో 232) వస్తాయని అంచనా.
ఇవి చూస్తే, NDA ఇంకా బలంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. INDIA కూటమికి మరింత ఐక్యత, సమన్వయం అవసరమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

One thought on “ఇండియా కూటమి భవిష్యత్తు: రాహుల్ గాంధీ నాయకత్వం కోరిన ప్రజలు – సర్వే వివరాలు”
Comments are closed.