హైదరాబాద్‌లో చెన్నై యువతిపై లైంగిక దాడి..

హైదరాబాద్‌ మరో అమానుష ఘటనకు వేదికైంది. చెన్నైకి చెందిన బీఎండీ ఫైనల్ ఇయర్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే… చెన్నైలో బయోమెడికల్ విద్యను అభ్యసిస్తున్న యువతిని ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్‌కు రప్పించాడు ఆమె స్నేహితుడు అజయ్. కూకట్‌పల్లిలోని లేడీస్ హాస్టల్‌లో ఉంటున్న యువతిని పార్టీ ఉందంటూ తన స్నేహితుడు హరిలోకేషన్‌కు రావాలని చెప్పాడు.

అజయ్ పిలుపు మేరకు యువతి నిజాంపేటలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో ఉన్న హరి నివాసానికి వెళ్లింది. అయితే అక్కడ వారు ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, మత్తులోకి వెళ్లిన తర్వాత ఇద్దరూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

దీంతో మానసికంగా తల్లడిల్లిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు మందిపై కేసు నమోదు చేసి, నిందితుల అరెస్ట్‌కు చర్యలు ప్రారంభించారు. బాధితురాలిని మెడికల్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

పూర్తి వివరాలు కోసం అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Read More : ఎక్స్పీరియమ్ లో ప్రపంచ సుందరుల సందడి.

One thought on “హైదరాబాద్‌లో చెన్నై యువతిపై లైంగిక దాడి..

Comments are closed.