నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ 3 సినిమా, ప్రతి అప్‌డేట్‌తో అభిమానుల అంచనాలను పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమా ఇంటెన్సిటీ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే పట్ల ఆసక్తి పెరిగింది. నాని, అర్జున్ సర్కార్ పాత్రలో ‘నెవ్వర్ బిఫోర్’ అనే వైల్డ్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం విడుదల అవుతుండడంతో, ప్రమోషన్లలో వేగం పెంచారు.
ఈ సినిమా భాగంగా, తొలి పాట ‘ప్రేమ వెల్లువ’ పేరుతో విడుదల చేశారు. ప్రేమతో పాటు ఓ నెమ్మదైన పేస్‌ను కలిగిన ఈ పాట ఓ క్లాసిక్‌గా అనిపించేలా ఉంది. ‘వైల్డ్ ఆఫీసర్’ పాత్రలో ఇంత ప్రేమికుడు ఉంటాడా? అనే భావనకు కారణమవుతున్న ఈ సాంగ్‌ను మిక్కీ జే మేయర్ మెలోడీ ట్రాక్‌లో రూపొందించారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరాం తన గానంతో మరోసారి మాయ చేశాడు, గాయని నూతన మోహన్ గళం కూడా అద్భుతంగా కలిసి వచ్చింది.
ఈ పాట యొక్క లిరిక్స్ క్రిష్ణకాంత్ రాసినవిగా, సాధారణ ఆడియెన్స్‌కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. పాటకు అసలైన హైలైట్ నాని మరియు శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ. సైలేష్ కొలను ఈ లవ్ ట్రాక్‌ను చాలా సహజంగా, సున్నితంగా డిజైన్ చేశాడు. హిట్ వంటి క్రైమ్ థ్రిల్లర్‌లో ఈ ప్రేమకథ ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ లేయర్‌ను అందించనున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విజువల్‌గా ఈ పాట చాలా న్యాచురల్‌గా కనిపిస్తుంది, ఫీల్‌గుడ్ మరియు డీప్ కనెక్ట్ ఉన్న ప్రేమకథను సింపుల్‌గా చూపించారు. నాని పాత్రలో ఓ రఫ్ అండ్ టఫ్ పోలీస్ వెర్షన్ ఉన్నప్పటికీ, ఈ పాటలో ఆయన సాఫ్ట్ సైడ్‌ను చూపించడం సినిమాకు మంచి డైమెన్షన్ ఇస్తోంది. శ్రీనిధి పాత్రకు కూడా ఇది బలాన్ని ఇచ్చేలా ఉంది.
హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడో సినిమా కావడంతో, ముందు రెండు భాగాలు సక్సెస్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంతి త్రిపినేని నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మే 1న థియేటర్లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

One thought on “హిట్ 3: ‘ప్రేమ వెల్లువ’ – వైల్డ్ ఆఫీసర్ లో లవ్ యాంగిల్!”
Comments are closed.