పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు.. ఈ ఆదాయంలో నిర్మాతలకూ వాటా?

High Popcorn and Cool Drinks Prices in Theaters

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ కి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, నెలకొకసారి అయినా కుటుంబంతో కలిసి సినిమా చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే, పెరిగిన టికెట్‌ రేట్లు, పాప్‌కార్న్‌, కూల్‌ డ్రింక్స్‌ ధరలు ఈ అనుభవానికి అడ్డు తగులుతున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేటుకంటే పాప్‌కార్న్‌ రేటే ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా, కుటుంబంతో కలిసి నలుగురు సినిమా చూడాలంటే భారీ ఖర్చు పెట్టాల్సి రావడంతో సామాన్య ప్రేక్షకులు వెనక్కి తగ్గుతున్నారు.

ఇటీవల, ఈ అంశంపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ స్పందిస్తూ, టికెట్‌ రేట్లు, పాప్‌కార్న్‌, కూల్‌ డ్రింక్స్‌ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఆదాయంలో నిర్మాతలకూ వాటా దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు. థియేటర్ల కొరత విషయమై సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో కనీసం 20,000 థియేటర్లు ఉండాలని, రాజస్థాన్‌లోని మండవాలో బిలియనీర్లుండినా, ఒక మూవీ థియేటర్‌ కూడా లేకపోవడం వల్ల ప్రజలు 2.5 కిలోమీటర్లు ప్రయాణించి సినిమా చూడాల్సి వస్తోందని చెప్పారు.

సల్మాన్‌ వ్యాఖ్యానించిన మరో ఆసక్తికర విషయం మాస్‌, క్లాస్‌ సినిమాల మధ్య గల అంతరం తగ్గిపోతున్నదనేది. మల్టీప్లెక్స్ ప్రేక్షకులు కూడా మాస్‌ థియేటర్లలో సినిమాలను ఆస్వాదిస్తున్నారని, పీవీఆర్‌, ఐనాక్స్‌ వంటి పెద్ద మల్టీప్లెక్సులు ఉన్నప్పటికీ, మాస్ మూవీని అనుభవించేందుకు మాస్ థియేటర్లను అభిమానం చూపిస్తున్నారని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సల్మాన్‌ గత కొన్ని సినిమాలుగా నిరాశ పరిచినప్పటికీ, తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన “సికిందర్” సినిమాపై పెద్ద ఆశలు పెట్టుకున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా ఈద్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా సల్మాన్‌కి తిరుగులేని హిట్‌గా నిలుస్తుందా? వేచి చూడాలి.

Read More

One thought on “పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు.. ఈ ఆదాయంలో నిర్మాతలకూ వాటా?

Comments are closed.