హర్యానాలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. సోనిపట్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఓ యువ మోడల్ శీతల్‌ను అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేశారు. శీతల్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలింపు చర్యల సందర్భంగా కండా గ్రామ సమీపంలోని కాలువలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో దుండగులు హత్య అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు తేలింది. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో పంజాబ్‌లో కూడా ఇలాంటి ఘోర ఘటన చోటు చేసుకుంది. బఠిండాలోని ఆదేశ్ యూనివర్సిటీ పార్కింగ్ ప్రాంతంలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కంచన్ కుమారి మృతదేహం ఆమె కారులో గుర్తించడంతో స్థానికంగా కలకలం రేగింది. ‘‘కమల్ కౌర్ భాబీ’’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్, ‘‘ఫన్నీ భాబీ టీవీ’’ పేరుతో యూట్యూబ్‌లో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కంచన్ ఈ దారుణ ఘటనకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హర్యానాలో శీతల్ హత్య కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

One thought on “హర్యానాలో యువ మోడల్ శీతల్ దారుణ హత్య”
Comments are closed.