తీవ్ర అనారోగ్యంలో ఫిష్ వెంకట్

తెలుగు సినీ ప్రేక్షకులకు కామెడీ విలన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం గణనీయంగా క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల తిరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని సమాచారం. ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలమవుతున్న కుటుంబం, ఆసుపత్రి ఖర్చులను భరించలేని పరిస్థితిలో దాతల్ని, సినీ ప్రముఖులను సాయానికి వేడుకుంటోంది. “దయచేసి మా ఫ్యామిలీని కాపాడండి” అంటూ ఆయన భార్య, కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల సహాయం అందించి వెంకట్‌కు అండగా నిలిచిన విషయం తెలిసిందే.

కిడ్నీ మార్పిడి అత్యవసరమని వైద్యులు సూచించగా, ఇందుకు అవసరమైన ఖర్చు తీరలేని స్థితిలో కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిష్ వెంకట్ తన సినీ ప్రయాణంలో 100కు పైగా చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పరిస్థితిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా), సినీ ప్రముఖులు స్పందించి ఆర్థికంగా అండగా నిలవాలని అభిమానులు కోరుతున్నారు.

Read More : ‘గేమ్ ఛేంజర్’ వివాదంపై నిర్మాత శిరీష్ బహిరంగ లేఖ…

One thought on “తీవ్ర అనారోగ్యంలో ఫిష్ వెంకట్

Comments are closed.