బుల్లెట్ బైక్ దొంగలు బీటెక్ విద్యార్థులు!

యూట్యూబ్ వీడియోల ద్వారా తాళాలు ఎలా తీయాలో నేర్చుకొని బుల్లెట్ బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు.వీరిలో ఆరుగురు ఒంగోలులో, మరొకరు కందుకూరులో బీటెక్ చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. దొంగతనాల్లో నైపుణ్యం పెంచుకునేందుకు యూట్యూబ్ వీడియోలను ఉపయోగించినట్టు విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు 16 బుల్లెట్ బైకులు, ఒక స్కూటీని దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన వాహనాల మొత్తం విలువ సుమారు రూ.25.20 లక్షలుగా అంచనా వేయబడింది. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను కొనసాగిస్తున్నారు.

Read More : మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు