అన్నమయ్య జిల్లాలో పర్యటించిన సీఎం ?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అన్నమయ్య జిల్లా బోయినపల్లిలో పర్యటించారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు. గత 30 ఏళ్లుగా ఒక మిషన్‌లా పనిచేస్తున్నాను. పేదల జీవితాల్లో వెలుగు నింపడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మా ప్రభుత్వంలో జీతాలు, పెన్షన్లు సకాలంలో అందుతున్నాయి. అభివృద్ధి జరగాలి, ఆదాయం పెరగాలి. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి” అని పేర్కొన్నారు. రాయలసీమను ‘రతనాలసీమ’గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన చంద్రబాబు, వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కొంతమందికి అధికారం ఇస్తే తమ స్వార్థ ప్రయోజనాలకే వాడుకున్నారు. సిద్ధం.. సిద్ధం.. అని గట్టిగా అరచారు కదా.. ఇప్పుడు అసెంబ్లీలో అభివృద్ధి, వివేకా హత్య, గులకరాయి డ్రామాపై చర్చకు మీరు సిద్ధమా?” అంటూ వైసీపీకి సవాల్ విసిరారు.

Read More : శ్రీ సత్యసాయి జిల్లాలో లోన్ కమీషన్ గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య.

One thought on “అన్నమయ్య జిల్లాలో పర్యటించిన సీఎం ?

Comments are closed.