ఒక అమెరికన్ వ్యక్తి తన విమాన ప్రయాణం మరియు హోటల్ బుకింగ్ రద్దు కావడంతో నష్టపోయిన డబ్బును తిరిగి పొందడానికి వినూత్నంగా చాట్‌జీపీటిని “న్యాయవాదిగా” ఉపయోగించాడు. ఈ విషయం ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
విమానం మరియు హోటల్ సేవలు అందకుండా పోవడంతో రిఫండ్ కొరకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ వ్యక్తికి సంస్థల నుంచి సరైన స్పందన రాలేదు. ఆ పరిస్థితుల్లో, చాట్‌జీపీటీ సహాయంతో తాను సంస్థల రిఫండ్ విధానాలను పరిశీలించాడని, అటు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ తయారు చేసిన మెయిల్‌ను సంబంధిత అధికారులకు పంపాడని వెల్లడించారు.
ఆమెయిల్‌లో చాట్‌జీపీటీ తగిన విధంగా నిబంధనలను వివరించడంతో పాటు, తన హక్కుల ఆధారంగా డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొన్నదని చెప్పారు. ఫలితంగా, సంస్థలు స్పందించి చివరకు రిఫండ్ మంజూరు చేశాయని తెలిపారు.
ఈ విధంగా చాట్‌జీపీటీ వల్ల తనకు సుమారు 2 లక్షల రూపాయల పైగా మిగిలిందని పేర్కొన్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా సహాయపడగలదో, సాధారణ వినియోగదారులకు కూడా ఎంతవరకు ప్రయోజనం చేకూర్చగలదో చూపించే ఉదాహరణగా మారింది.
Read More : డ్రైవర్ లెస్ ట్రక్కులు మైనింగ్ రంగంలో విప్లవాత్మకం.
