భారత్ సమ్మిట్‌లో భారతదేశ పటంలో భారీ తప్పిదం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో భారతదేశానికి తీవ్ర అవమానం జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) మరియు లడఖ్ లేకుండా ముద్రించిన భారత పటాన్ని ఈ కార్యక్రమంలో ఉపయోగించడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురైంది.

ఈ మహాసభలో 100 దేశాలకు పైగా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. అంతర్జాతీయ వేదికపై దేశ పటాన్ని తప్పుగా చూపడం దేశ ద్రోహానికి సమానమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రంలోని పలువురు నేతలు, విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ గౌరవాన్ని దిగజార్చేలా ఉన్న ఈ చర్యపై సదరు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read More : శాంతి చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల విజ్ఞప్తి