భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగమైన భగవద్గీత మరియు నాట్యశాస్త్రం ఇప్పుడు UNESCO పొందాయి. ఈ రెండు గొప్ప వచనాలు యునెస్కో యొక్క “మెమరీ ఆఫ్ ది వరల్డ్” రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి.
భగవద్గీత మరియు నాట్యశాస్త్రానికి UNESCO గుర్తింపు దక్కడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ఈ ఘనతను ప్రతి భారతీయుడి గర్వంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికపై పోస్టు పెట్టారు.
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడూ గర్వించదగిన క్షణం. UNESCO మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీత మరియు నాట్యశాస్త్రం చేర్చబడడం మన గొప్ప సంస్కృతి మరియు జ్ఞానానికి పొందిన గొప్ప గుర్తింపు” అని ప్రధాని మోదీ తన పోస్టులో తెలిపారు.
