బీసీసీఐ అధ్యక్ష పీఠంపై క్రికెట్ దిగ్గజం?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయోపరిమితి నిబంధన కారణంగా పదవి నుంచి తప్పుకోవడంతో, ఆయన స్థానంలో ఓ క్రికెట్ దిగ్గజాన్ని నియమించే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి.

బిన్నీకి ఇటీవలే 70 ఏళ్లు నిండటంతో ఆయన పదవీకాలం ముగిసింది. తాత్కాలికంగా ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరులో జరగనున్న ఏజీఎంలో అధ్యక్షుడు సహా పలు కీలక పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇంగ్లండ్‌లో అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ సందర్భంగా ఓ సీనియర్ రాజకీయ నాయకుడు ఆ క్రికెట్ దిగ్గజంతో చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే ఆయన అంగీకారం తెలిపారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, క్రీడా సంస్థల్లో మాజీ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించుకోవడంతోనే ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో బీసీసీఐ ఎన్నికలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా జరిగాయి. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగే అవకాశాలు ఉన్నాయని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

Read More :భీకర వరదలోనూ మానవత్వం: హర్భజన్ సింగ్ ఫిదా.

One thought on “బీసీసీఐ అధ్యక్ష పీఠంపై క్రికెట్ దిగ్గజం?

Comments are closed.