నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా భారీ స్కేల్‌లో తెరకెక్కినట్లుగా అంచనాలు నెలకొన్నాయి. ఫైనల్ కాపీ లాక్ చేసిన తరువాత టీమ్, అభిమానులతో ఒక హ్యాపీ మూమెంట్‌ను పంచుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.
ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ‘భారీ ఎమోషన్లు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్’తో థియేటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సినిమా అని చిత్రబృందం ప్రకటించింది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, కళ్యాణ్ రామ్, టెక్నికల్ టీమ్ సభ్యులు కలిసి ఒక ఫోటోలో కనిపించి, ఈ చిత్రం పై ఉత్కంఠను మరింత పెంచారు.
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ట్రైలర్, టీజర్ ద్వారా మాస్, యాక్షన్ మోడ్‌లో కనిపించే కళ్యాణ్ రామ్ అభిమానులను ఆకట్టుకుంది. కథానాయికగా సాయి మంజ్రేకర్ నటించనుండగా, విలన్‌గా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కనిపించనున్నారు. విజయశాంతి తల్లి పాత్రలో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు.
ఈ సినిమాకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ట్రైలర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మ్యూజిక్, విజువల్స్, కథలో ఎమోషన్ అన్నీ కలిసి థియేటర్‌లో అద్భుతమైన అనుభవాన్ని కలిగిస్తాయని చిత్రబృందం చెబుతోంది.
