బంగారం ప్రియులకు శుభవార్త..!

శ్రావణమాసం ఆరంభం వేళ బంగారు ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా వారంరోజుల పాటు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1250 తగ్గగా.. ఈరోజు రూ.450 తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1360, రూ.490 తగ్గింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జులై 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,100లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,00,480లుగా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర నేడు రూ.92,100లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 1,00,480లుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.92,250లుగా.. 24 క్యారెట్ల ధర రూ.1,00,630లుగా కొనసాగుతోంది. ప్రాంతాల వారీగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. నేటి నుంచి శ్రావణమాసం ఆరంభం అయింది. ఈ సమయంలో గోల్డ్ రేట్స్ తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. పండగలు, పెళ్లిళ్ల సీజన్ కాబట్టి రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

మరోవైపు వెండి స్థిరంగా ఉంది. నిన్న కిలో వెండిపై వెయ్యి రూపాయలు తగ్గగా ఈరోజు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్ లో ఈరోజు కిలో వెండి రూ.1,18,000లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 28 వేలుగా ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ఒక లక్ష 18 వేల రూపాయలుగా నమోదైంది.

గమనిక: ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్ సైట్స్ లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇవి.

Read More : గాంధీనగర్ ప్రమాదం – టాటా సఫారీ వేగం కారణమా?