ఐదు హీరోయిన్లు ఫైనల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ పాన్ వరల్డ్ సినిమాపై సినీప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. హాలీవుడ్ టెక్నీషియన్లు, టాప్ ఆర్టిస్టులతో ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు అట్లీ రంగంలోకి దిగారు. ప్రముఖ నిర్మాత కలానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా ప్రత్యేకతలు చూస్తే, హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలకు పోటీగా మూడు విభిన్న ప్రపంచాల్లో జరిగే కథతో బన్నీ మూడు పాత్రల్లో నటించనున్నాడు. భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్‌కు అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకే కథ, టెక్నీషియన్లు మాత్రమే కాకుండా, హీరోయిన్ ఎంపికలోనూ భారీగా ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే దీపికా పదుకోన్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే లాంటి ఐదుగురు క్రేజీ హీరోయిన్లను సెలెక్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా పేరు ఎక్కువగా చర్చలో ఉన్నప్పటికీ, గతంలో ‘జవాన్’లో అట్లీ – దీపిక కలిసి పని చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆమెను ఈ ప్రాజెక్ట్‌కు రప్పించగలడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో దీపికను మేనేజ్ చేయడం అట్లీకి సాధ్యమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ అట్లీ, బన్నీ కాంబినేషన్, ఈ భారీ హీరోయిన్ కాస్టింగ్‌తో సినిమా పై ఆసక్తి పెరిగిపోతుంది. ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు అధికారికంగా వచ్చేవరకు ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Read More : సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్‌కు నోటీసులు.