‘ఆదిత్య 369’ 4K రీ-రిలీజ్ – విడుదల తేదీ ఖరారైంది!

"నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండరీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఆదిత్య 369' 4K రీ-రిలీజ్‌కు సిద్ధం – ఏప్రిల్ 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్!"

1991లో విడుదలైన నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ మరొకసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్‌ను శ్రీదేవి మూవీస్ 4K రిజల్యూషన్, 5.1 సౌండ్ క్వాలిటీతో పునరుద్ధరించింది. ఈ రీ-రిలీజ్ ఏప్రిల్ 11న జరగనుంది.

సినిమాను అత్యాధునిక సాంకేతికతతో మెరుగుపరచడానికి ప్రసాద్ ల్యాబ్‌లో ఆరు నెలల పాటు ప్రత్యేక రీ-స్టోరేషన్ చేపట్టారు.

నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, “ఈ అద్భుత చిత్రాన్ని ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు అందించడంలో మేము గర్విస్తున్నాం” అని తెలిపారు.

అలాగే, సినిమాను సమర్పించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులర్పిస్తూ, శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించినట్టు ప్రశంసించారు.

ఈ చిత్రంలో అమ్రిష్ పురి, తిన్ను ఆనంద్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, ఛాయాగ్రాహకులు పీసీ శ్రీరామ్, వీఎస్‌ఆర్ స్వామి, కబీర్ లాల్ అందించిన విజువల్స్ ఈ సినిమాను చిరస్థాయిగా నిలిపాయి.

ఈ చిత్రం మా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌కు గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. బాలయ్య బాబు వరుస విజయాలతో యువతను అలరిస్తున్నారు. ‘ఆదిత్య 369’ రీ-రిలీజ్ కూడా ఆ జోష్‌ను కొనసాగిస్తుంది” అని నిర్మాత కృష్ణ ప్రసాద్ అన్నారు.

అప్పుడు మిస్ అయ్యారా? మళ్లీ థియేటర్‌లో చూడాలనుకుంటున్నారా? – ‘ఆదిత్య 369’ గ్రాండ్ రీ-రిలీజ్‌కు సిద్ధంగా ఉండండి!

Read More

One thought on “‘ఆదిత్య 369’ 4K రీ-రిలీజ్ – విడుదల తేదీ ఖరారైంది!

Comments are closed.