అదితి రావు హైదరి పాత వ్యాఖ్యలు మరోసారి వైరల్?

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్‌ అవుతాయో ఊహించడం కష్టమే. కొన్నిసార్లు సెలబ్రిటీలు చిన్న వ్యాఖ్య చేసినా అది పెద్ద చర్చకు దారి తీస్తుంది. వివాదం లేకపోయినా కూడా ఆ వ్యాఖ్యలను వివాదాస్పదంగా చూపిస్తూ నెటిజన్లు వైరల్‌ చేస్తుంటారు. పలువురు హీరోలు, హీరోయిన్లు పొరపాటున అన్న మాటలు కూడా పెద్ద ఇష్యూ అవుతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలాంటి పరిణామం ఇప్పుడు హీరోయిన్‌ అదితి రావు హైదరి విషయంలో జరిగింది. దాదాపు పదేళ్ల క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

2013లో విడుదలైన మర్డర్ 3 సినిమా ప్రమోషన్ సమయంలో అదితి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో సోషల్‌ మీడియా అంత ప్రభావవంతంగా లేకపోవడంతో పెద్దగా హడావిడి కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ వ్యాఖ్యలను నెటిజన్లు సీరియస్‌గా తీసుకుంటూ విమర్శలు చేస్తున్నారు. కొందరు ఆమెను ట్రోల్‌ చేస్తుంటే, మరికొందరు సానుకూలంగా స్పందిస్తున్నారు.

ఆ సమయంలో మల్లికా షెరావత్‌ సర్జరీ గురించి ప్రచారం జరుగుతున్న తరుణంలో, అదితి చేసిన వ్యాఖ్యలు ఆమె గురించే అన్నట్టుగా పలువురు భావించారు. “మనిషికి నిజమైన బలం ఛాతిలో ఉండే సిలికాన్ వల్ల కాదు, ఆత్మలో ఉండే ఉక్కు వల్ల వస్తుంది” అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి బయటకు వచ్చి వైరల్‌ అయ్యాయి. నెటిజన్లు మాత్రం “ఒక మహిళ అయ్యి మరో మహిళ గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం సబబేనా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది నటీమణులు కాస్మోటిక్ సర్జరీలకు వెళ్తున్నారని, అందులో తప్పేమీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో అదితి రావు హైదరి తన పాత వ్యాఖ్యలపై స్పందిస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

Read More : తనను తాను చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు