నయనతార ‘టెస్ట్’ – ఏప్రిల్ 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్!

నయనతార టెస్ట్‌

చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్న అంశంతో రూపొందిన ‘టెస్ట్’ (Test) స్పోర్ట్స్‌  డ్రామా. ఎస్. శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, నేరుగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 4 నుంచి ప్రేక్షకులను అలరించనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారిక పోస్టర్ విడుదల చేసి వెల్లడించింది.


‘టెస్ట్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో మనందరి జీవితాల్లో ఒక మలుపు తప్పక ఉంటుంది. అదే జీవితంలో అసలైన ‘టెస్ట్’” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

తారాగణం & విశేషాలు
నయనతార – కుముధ పాత్రలో
సిద్ధార్థ్ – క్రికెటర్ అర్జున్‌గా
ఆర్. మాధవన్, మీరా జాస్మిన్ – కీలక పాత్రల్లో

🔹 దర్శకుడిగా శశికాంత్‌కి ఇది తొలి సినిమా
🔹 10 ఏళ్ల విరామం తర్వాత మీరా జాస్మిన్ రీఎంట్రీ
🔹 రెండు దశాబ్దాల తర్వాత మాధవన్ – మీరా జాస్మిన్ కలయిక

ఈ చిత్రాన్ని వైనాట్‌ స్టూడియోస్ నిర్మించగా, శక్తిశ్రీ గోపాలన్ సంగీతాన్ని అందించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ రచయిత సుమన్ కుమార్ అందించిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

క్రికెట్ నేపథ్యంలో భావోద్వేగాలతో రూపొందిన ఈ కథ, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

Read More

One thought on “నయనతార ‘టెస్ట్’ – ఏప్రిల్ 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్!

Comments are closed.