రెడ్ నోటీసులు జారీ, ఆస్తుల సీజ్ హెచ్చరిక

Red notices issued, asset seizure warning

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల విషయంలో కఠిన చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేసినవారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, నిర్ణీత గడువులోపు స్పందించకపోతే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించింది.

ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు ప్రక్రియలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కొన్ని సంస్థలు, వ్యక్తులు ఏళ్ల తరబడి పన్ను చెల్లించకపోవడంతో బకాయిల మొత్తం కోట్ల రూపాయలు చేరిందని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ వివరాలు గుర్తించామని తెలిపారు.

ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే 100 మందికి రెడ్ నోటీసులు జారీ చేయగా, మొత్తం రూ.860 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తేలింది. జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ ప్రాజెక్ట్ రూ.52 కోట్లు, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ రూ.32 కోట్లు, హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ రూ.30 కోట్లు, ఇండో అరబ్ లీగ్ రూ.7.33 కోట్లు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రూ.5.50 కోట్లు, సోమాజిగూడలోని కత్రియా హోటల్ రూ.8.62 కోట్ల మేర పన్ను బకాయిలను చెల్లించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

పన్ను బకాయిదారులు వెంటనే రెడ్ నోటీసులకు స్పందించాలని, లేకపోతే ఆస్తులను సీజ్ చేసే చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ స్పష్టంచేసింది.

Read More

One thought on “రెడ్ నోటీసులు జారీ, ఆస్తుల సీజ్ హెచ్చరిక

Comments are closed.