“ఢిల్లీలో అవినీతి పాలనకు ప్రజల గుణపాఠం – జీవీఎల్ నరసింహా రావు హాట్ కామెంట్స్

GVL Narasimha Rao: ఢిల్లీలో అవినీతి పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పారని మాజీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలు**

Delhi Election Results: అవినీతిపై ప్రజల తీర్పు – జీవీఎల్ హాట్ కామెంట్స్

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా వచ్చాయని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. 41 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉందని, ఖచ్చితంగా 46 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించిన ఆయన, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ను ఓడించడం గొప్ప విజయమని అన్నారు. గత ఎన్నికల ఫలితాల కంటే భిన్నంగా, డబుల్ ఇంజిన్ సర్కార్‌కు ఢిల్లీ ప్రజలు మద్దతు ఇచ్చారని తెలిపారు. మరోసారి మోదీ నాయకత్వానికి ఢిల్లీ ఓటర్లు విశ్వాసం చూపారని జీవీఎల్ పేర్కొన్నారు.

The “AAP” party could not deceive the people

ఆప్ నాయకుల వాగ్దానాలను ప్రజలు విశ్వసించలేదని జీవీఎల్ అన్నారు. అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. అధికార దుర్వినియోగం చేసి, సామాన్యుడిగా చెబుతూనే కేజ్రీవాల్ శీష్ మహల్ నిర్మించుకున్నారని తీవ్రంగా విమర్శించారు. పోటీ చేసిన స్థానాల్లో గెలుపుకోసం కేజ్రీవాల్ తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు AAP పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు.

బీజేపీ హామీలు అమలు – మోదీపై ప్రజలకు విశ్వాసం

ఢిల్లీలో బీజేపీ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని జీవీఎల్ హామీ ఇచ్చారు. మోదీ అంటేనే విశ్వాసం అని, ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసేలా పాలన సాగిస్తామని GVL Narasimha Rao పేర్కొన్నారు.

Read more

One thought on ““ఢిల్లీలో అవినీతి పాలనకు ప్రజల గుణపాఠం – జీవీఎల్ నరసింహా రావు హాట్ కామెంట్స్

Comments are closed.