ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడిన 12 భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు, మరో 16 మంది ఆచూకీ తెలియకపోవడంతో భారత విదేశాంగ శాఖ వివరించింది.
Russia conflict: రష్యాలో 16 మంది భారతీయులు మిస్సింగ్
ఇప్పటి వరకు 12 మంది మృతిచెందినట్లు కేంద్రం ప్రకటించింది
న్యూఢిల్లీ, జనవరి 17: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయుల్లో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం రష్యా తరుఫున 126 భారతీయులు యుద్ధంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. 96 మందిని రష్యా విడుదల చేసి, కొంతమందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇంకా 18 మంది రష్యా ఆర్మీలో ఉన్నట్లు, అందులో 16 మంది ఆచూకీ తెలియకపోవడంతో వారు కనిపించకుండా పోయినట్లు రష్యా ప్రకటించిందని ఆయన వెల్లడించారు. మిగిలిన వారిని స్వదేశానికి పంపించాలని భారత్ రష్యాకు కోరిందని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
Also Read:
