మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్

Mohan Babu: మోహన్ బాబు ఆరోగ్యంపై తాజా బులిటెన్

మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు.

మంచు మోహన్ బాబు కుటుంబంలో గత మూడు రోజులుగా చోటుచేసుకున్న కుటుంబ విభేదాలు అందరికీ తెలిసినవే. ఈ వివాదాలు మంగళవారం మరింత తీవ్రంగా మారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయమయ్యింది. దాంతో ఆయనను మంచు విష్ణు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

మోహన్ బాబు ఆరోగ్యం – మొదటి బులిటెన్

మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్ గురు ఎన్. రెడ్డి వివరణ ఇచ్చారు. ఆయన ఆస్పత్రికి వచ్చినప్పుడు ఒళ్లునొప్పులు, బీపీ అధికంగా ఉండటం, మెడ నొప్పి తీవ్రంగా ఉండటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మానసికంగా కృంగిపోయి, అధిక ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ముఖంపై చిన్న గాయాలు ఉన్నట్లు వెల్లడించారు. బీపీ 200 పైగా ఉంది, ఇప్పటికీ అదుపులోకి రాలేదని తెలిపారు.

వైద్యుల ప్రకారం, హృదయ సంబంధిత సమస్యలేమీ లేవు కానీ రాత్రంతా నిద్రలేమితో ఇబ్బంది పడ్డారు. మోహన్ బాబు గతంలో కొన్ని శస్త్రచికిత్సలు చేయించుకోవడంతో కొన్ని ప్రత్యేక ఔషధాలు వాడుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్యం స్థిరంగా లేదు. కొన్ని అంతర్గత గాయాలున్నట్లు సీటీ స్కాన్‌లో గుర్తించారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని, డిశ్చార్జ్‌కి కనీసం రెండు రోజులు పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు.