బాలయ్య, బోయపాటి బృందం కీలక ప్రకటన

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది.

తాజాగా విడుదల చేసిన ప్రకటనలో నిర్మాతలు, సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. సినిమా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, ముఖ్యంగా రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌కు మరింత సమయం అవసరమవుతున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు వివరించారు. అత్యుత్తమ థియేటర్ అనుభూతి అందించాలన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.

అసలు ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 25న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినా, పనుల్లో జాప్యం కారణంగా ఆ తేదీకి విడుదల సాధ్యం కాదని ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని తెలియజేస్తామని తెలిపారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అన్ని భాషల్లో అద్భుత స్పందన లభించిందని, ఆ అంచనాలను అందుకునేలా సినిమాను రూపొందిస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. ‘అఖండ 2’ తాండవం ఒక సినిమా మాత్రమే కాదు, అదొక సినిమా పండుగ అవుతుందని చెబుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ భారీ విజయాన్ని అందుకుంది. దాని సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’పై దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Read More : జాన్వీ కపూర్ ‘పరమ్‌ సుందరి’ రెయిన్‌ డాన్స్‌ సెన్సార్‌ క్లియరెన్స్ ?

One thought on “బాలయ్య, బోయపాటి బృందం కీలక ప్రకటన

Comments are closed.