ఆర్ఎఫ్‌సీఎల్ నుండి యూరియా సరఫరాపై మంత్రి తుమ్మల భేటీ

రాష్ట్రంలో యూరియా కొరతను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ (RFCL) నుండి రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్ఎఫ్‌సీఎల్ ఎండీ సురేందర్ సింగ్‌ను మంత్రి శ్రీధర్ బాబు చాంబర్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆర్ఎఫ్‌సీఎల్ నుంచి రావాల్సిన యూరియా సరఫరా జాప్యం గురించి ఎండీ సురేందర్ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు.

‘త్వరలోనే సరఫరాలు చేస్తాం’

మంత్రి తుమ్మల విజ్ఞప్తికి ఆర్ఎఫ్‌సీఎల్ ఎండీ సురేందర్ సింగ్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి యూరియా సరఫరాలు త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో రైతుల సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

Read More : అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు