తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న నటుడు విజయ్ కొత్త పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) మదురై మహాసభకు అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. మదురైకి సమీపంలోని పరపత్తి ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభాస్థలిలో ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. తమ అభిమాన నటుడిని చూడటానికి, అతని ప్రసంగం వినటానికి లక్షలాదిగా తరలివచ్చారు.
ఈ మహాసభలో పార్టీ జెండా, గుర్తును విజయ్ ఆవిష్కరించారు. విజయ్ ప్రసంగం ప్రారంభించగానే వేదిక వద్ద ఉన్న జనం హోరెత్తించారు. వారి ఉత్సాహం చూసి విజయ్ కంటతడి పెట్టుకున్నారు. జన సమూహాన్ని చూసి ఉద్వేగానికి లోనైన విజయ్, తమపై అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సభలో విజయ్ రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ వ్యూహాన్ని, లక్ష్యాలను వివరించారు. ఈ మహాసభతో టీవీకే పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తిగా తమిళనాడు ప్రజల ముందుకు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇతర పార్టీల పొత్తులపై కూడా ఈ సభలో స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు.
Read More : మధురైలో విజయ్ భారీ బహిరంగ సభ

One thought on “టీవీకే మదురై మహాసభకు పోటెత్తిన జనం (Video)”
Comments are closed.