అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాల కారణంగా ప్రవహిస్తున్న వాగులను దాటడానికి గిరిజనులు పడుతున్న కష్టాలు ‘బాహుబలి’ సినిమాలో దృశ్యాలను తలపిస్తున్నాయి. పాడేరు పెదబయలు మండలంలోని పెదకోడపల్లి పంచాయతీలో చెక్కరాయికి వెళ్లే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, ఒక గిరిజనుడు తన కొడుకును భుజాలపై ఎత్తుకుని వాగును దాటాడు.
వివరాలు:
కాంతారావు అనే గిరిజనుడు తన చిన్న కొడుకును భుజాలపై ఎత్తుకుని, ప్రాణాలకు తెగించి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఘటన సినిమా సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
వాగులు, వంకలు దాటడం తమకు నిత్యకృత్యంగా మారిందని, చిన్న అనారోగ్యానికి కూడా ఆసుపత్రికి వెళ్లడం కష్టంగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వాగుపై వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
Read More : ఏపీలో పేదరిక నిర్మూలనకు ‘P-4’ కార్యక్రమం ప్రారంభం
